Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వరుసగా ఏడో త్రైమాసికంలోనూ ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో దూసుకుపోయి రూ.8,022 కోట్ల లాభాలను నమోదుచేసింది. రిఫైనింగ్ మార్జిన్లలో మంచి లాభాలను ఆర్జించడంతో గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో స్వతంత్ర నికర లాభాలను రూ.8,022 కోట్లకు పెంచుకోగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం కంపెనీ రూ.7,856 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. ఫలితాల్లో ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది. మార్కెట్ అవర్స్ అనంతరం రిలయన్స్ ఫలితాలు వెల్లువడ్డాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్ 1.3 శాతం పడిపోయి రూ.1,077 వద్ద ముగిసింది.
టెలికాం సేవలందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ సబ్స్క్రైబర్ బేస్ కూడా డిసెంబర్ 31 వరకు 7 కోట్ల మార్కును చేధించినట్టు కంపెనీ తెలిపింది. 90 శాతం కంటే ఎక్కువ జనాభాను జియో ఆపరేషన్లను త్వరలోనే కవర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా రిలయన్స్ జియో పేరొందుతోంది.
వరుసగా ఎనిమిది త్రైమాసికాల నుంచి కంపెనీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లను రెండంకెల సంఖ్యలో నమోదుచేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. గ్లోబల్గా వస్తున్న డిమాండ్తో జీఆర్ఎమ్లు గణనీయమైన వృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. యేటికేటికి కంపెనీ మొత్తం ఆదాయాలు సుమారు 10 శాతం పెరిగి రూ.69,631 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరం ఇదే కాలంలో రూ.63,406 కోట్ల ఆదాయాలను కంపెనీ ఆర్జించింది.