Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వస్తున్నా దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్స్ సోమవారం రాత్రి ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ అటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి కాస్తా పర్వాలేదు అనే టాక్ వస్తూ వుంటే, మరో వైపు ఇప్పటి వరకు ఎ సినిమా ట్రైలర్స్ కి రానటువంటి డిజ్లైక్స్ డీజేకి వస్తున్నాయి. మొదటి సారిగా ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో డిజ్లైక్స్ వచ్చినట్లు కూడా టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే ఇలా డీజీ ట్రైలర్స్ కి ఈ స్థాయిలో విమర్శలు, వ్యతిరేకత రావడం వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులు వున్నారని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ట్రైలర్ క్రింద పెట్టె కామెంట్స్ బట్టి పవన్ ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కూడా కనిపిస్తుంది. అయితే చిత్రం యూనిట్ కూడా యూ ట్యూబ్ లో ట్రైలర్ పై వస్తున్న వ్యతిరేకతకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. బయటకు ఆ విషయం చెప్పకపోయిన, మనసులో అదే ఫీలింగ్ తో వున్నారని కూడా తెలుస్తుంది. ఈ విషయం ఇప్పటికే మెగా కాంపౌండ్ కి వార్త వెళ్ళినట్లు కూడా ఓ వార్త ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. అయితే ఇదంతా చేస్తుంది పవన్ ఫ్యాన్స్ కాదని, మెగా యాంటీ ఫ్యాన్స్ ఇలా డిజ్లైక్స్ చేస్తూ అది పవన్ ఫ్యాన్స్ చేస్తున్నట్లు క్రియేట్ చేస్తున్నట్లు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఏది, ఏది అబద్ధం అనే విషయాలు మాత్రం అంతగా ఎవరికీ తెలియదు.