Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎంగేజ్ మెంట్ అయిన తరువాత అఖిల్, శ్రీయ భూపాల్ లు విడిపోవడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది.అన్న నాగచైతన్య కంటే ముందే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ త్వరలో పెళ్ళికి కూడా సిద్దమవుతున్నతరుణంలో వీరిద్దరూ విభేదాలతో విడిపోవడం చర్చనీయాంశంగా మారింది.కానీ వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఓ సిల్లీ రీజన్ కే అఖిల్, శ్రీయ లు విడిపోయినట్లు సినీవర్గాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అఖిల్ నటించిన తొలి చిత్రం విఫలం కావడంతో అతని కెరీర్ పై పునరాలోచనలో పడ్డాడు. దీనితో నాగార్జున ఈ సమయం లో అఖిల్ పెళ్లి సరైంది కాదని రెండవ చిత్రం విడుదలై అఖిల్ కెరీర్ గాడిలో పడిన తరువాత జరిగితే బావుంటుందని శ్రీయ కుటుంబానికి తెలిపాడట. అఖిల్ కూడా తండ్రి నిర్ణయంతో ఏకీభవించాడట.శ్రీయ కుటుంబ సభ్యలు మాత్రం వెంటనే వివాహం జరిగిపోవాలని గట్టిగా డిమాండ్ చేయడంతో వివాదం మొదలయిందని అది అఖిల్, శ్రీయ ల మధ్య మనస్పర్థలకు కూడా కారణమైందని వార్తలు వస్తున్నాయి. కాగా శ్రీయ ప్రస్తుతం ఓ ఏన్నారై తో వివాహానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.