Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం మండుతున్న సూర్య భగవానుడి వేడికి తట్టుకోలేక మానవుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అయితే జన సంద్రంలో ఉండే మనుషులు కాబట్టి ఎవరో ఒకరు సహాయం చేస్తారు కానీ ముగ జీవుల పరిస్థితి ఏంటి?. ముఖ్యంగా అడవుల్లో ఉండే కొన్ని జంతువులు నీళ్లు లేక ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న కొన్ని జాతుల జంతువులు తమ మనుగడను కోల్పోతున్నాయి. ముఖ్యంగా పాములు సంతతి గత ఏడాదితో పోలిస్తే 35% తగ్గిందని కేద్ర అటవీ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇండియన్ కోబ్రా గా పిలవబడే త్రాచు పాముల సంఖ్య మరి దారుణంగా తగ్గిపోయిందని తెలిపారు.దీంతో అక్కడక్కడ కొందరు అటవీ శాఖ అధికారులు ఈ విషయం పై జాగ్రత్త వహిస్తున్నారు. అయితే వాటి దాహం తీర్చుకునేందుకు కొన్ని పాములు అడవి దాటి వస్తున్నాయి. రీసెంట్ గా అడవికి సమీపంలో ఉన్న జనావాసాల్లోకి వచ్చిన 9 అడుగుల త్రాచు పాముని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అది దాహం కోసమే వచ్చిందని తెలుసుకొని దానికి వాటర్ బాటిల్ తో నీళ్లు తగ్గించారు. అదేంటీ ఎలా తాగించాడని ఆశ్చర్యపోతున్నారా. కింద ఉన్న వీడియోని చుడండి.