Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆంధ్రప్రదేశ్తె రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన కోసం అప్పట్లో కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ స్థాపించారు. అదే పార్టీ తరుపున తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం లేదని, అదంతా కేసిఆర్ సొంత సొత్తుగా మార్చేసుకున్నారని, బడుగు బలహీన వర్గాలకు ఇప్పటికి అన్యాయం జరుగుతుందని ఉద్దేశ్యంతో కేసిఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ఏర్పాటు జరుగుతుంది. దాని పేరు తెలంగాణ ఇంటి పార్టీ. ఈ పార్టీ ఏర్పాటుకి తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ నడుంబిగించారు. ఇందిరా పార్క్ దగ్గర వున్న ధర్నా చౌక్ తొలగించడానికి ప్రయత్నించడం, మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వకపోగా వారిని బేడీలు వేసి ఖైదీలుగా అరెస్టు చేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎదుర్కొనేందుకు ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పార్టీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో తెలంగాణ ఉద్యమ శక్తులని ఏకతాటిపైకి తీసుకొస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగట్టేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెరుకు సుదాకర్ తెలిపారు. ఈ పార్టీ ప్రారంభోత్సవంలో తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, విద్యార్ధి జేఎసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్య పాల్గొంటారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉన్నందు వలన, పార్టీ ఏర్పాటుకి, స్వచ్చమైన, బడుగు, బలహీన వర్గాలు కోరుకున్న తెలంగాణ నిర్మాణం జరపడానికి ఇదే సరైన సమయం అని ఆయన అన్నారు. మొత్తానికి తెలంగాణ ఇంటి పార్టీ సొంతింట్లో ఎ మేరకు వెళ్తుందో చూడాలి మరి.