Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తాత్కాలిక ఉద్యోగుల‌కు రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో స‌మానంగా జీత‌భ‌త్యాలు ఇవ్వాల్సిందేన‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. చేస్తున్న ప‌ని ఒక‌టే అయిన‌ప్పుడు జీతాల్లో తేడాలెందుకు? స‌మాన ప‌నికి స‌మానం జీతం ఇవ్వాల్సిందేన‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు సంస్థ ఏదైనా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు తాత్సాలిక ఉద్యోగుల‌కు స‌మాన‌మైన జీతం ఇవ్వాల్సిందేన‌ని, ఒక వ్య‌క్తి ఇత‌రుల‌కు స‌మానంగా ప‌ని చేస్తున్న‌ప్పుడు, బాధ్య‌త‌లు స‌మానం అయిన‌ప్పుడు .. ఇచ్చే భ‌త్యం స‌మానంగానే ఉండాల‌ని సుప్రీం వ్యాఖ్యానించింది.

పంజాబ్ తాత్కాలిక ఉద్యోగుల సంఘం వేసిన వ్యాజ్యానికి తీర్పునిస్తూ ఈ సంచ‌ల‌న తీర్పును చెప్పింది. ఆ మాత్రం జీతం కూడా రాక‌పోతే కుటుంబం ఇబ్బందులు ప‌డుతుంది.. ఆత్మాభిమానం తాక‌ట్టు పెట్టుకుని.. ఆస‌క్తి లేకుండా ప‌నిచేస్తార‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. ఒక‌వేళ ఇదే రూల్ వ‌ర్తింప‌జేస్తే గ‌నుక మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే ల‌క్ష‌లాది తాత్కాలిక ఉద్యోగుల‌కు బోలెడంత మేలు జ‌రిగిన‌ట్టే. అయితే లోప‌భూయిష్ట‌మైన ఈ సిస్ట‌మ్‌లో స‌మాన భ‌త్యాలు ఇచ్చే సీనుందా? క‌ంపెనీ దివాళా తీసింది అంటూ ఉద్యోగుల్ని పీకేసేందుకు ప్ర‌యివేటు సంస్థ‌లు తెగ‌బ‌డ‌వంటారా? మ‌న చ‌ట్లాల్లోని లోపాల్ని సుప్రీం తీర్పు స‌వ‌రించ‌గ‌ల‌దా? .. అన్నిటికీ కాల‌మే స‌మాధానం చెప్పాలి.