Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమిళనాట ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా జయలలిత కి చాలా పెద్ద పేరే ఉంది. మిగితా రాజకీయ శక్తుల లాగా ఆమెకి కుటుంబం అనేది లేదు . ఆమె లేకుంటే అధికారం చేపట్టేందుకు వారసులు కూడా లేరు. పరాయి మనుషులే సొంత మనుషులు లాగా ఆమె తో ఉన్నారు. డబ్భై యోడు రోజుల పాటు ఆమె ఆసుపత్రిలో ఉండి బయటకి శవం గా వస్తే దేశం మొత్తం కన్నీరు మున్నీరు అయ్యింది. మోడీ దగ్గర నుంచీ కేంద్ర మంత్రి వెంకయ్య వరకూ ఆమె చనిపోయిన తర్వాత అన్నా డీఎంకే లో పరిస్థితి ని చక్కదిద్దారు అని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ తమిళనాడులో ఈ రాజకీయ శూన్యతను తన ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవాలని అనుకుంటున్నట్టు వారు భావిస్తున్నారు. ఒకవంక జయలలిత మరణం..మరోవంక డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థత..ప్రజాబాహుళ్యంలో డీఎంకే ఇంకా కోలుకోకపోవడం..ఈపరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో రాజకీయ పాగాకు ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత అన్నాడీఎంకే విషయానికొస్తే..శశికళ ఒక ప్రధాన అధికార కేంద్రం.. ఇక ముఖ్యమంత్రిగా తాజాగా అధికార పీఠమెక్కిన పన్నీర్ సెల్వం జయలలితకు నమ్మినబంటు. కార్యకర్తలకీ , ప్రజలకీ నమ్మినబంటు గానే పన్నీర్ పరిచయం. శశికళ విషయం లో జనాలకి సానుకూలత లేదు. జయలలిత ని ఇబ్బంది పెట్టింది అనే అందరూ అనుకుంటారు. సో పన్నీర్ కి సపోర్ట్ ఇవ్వడం ద్వారానే తమిళనాట తాము పాదం మోపి బలపడదాం అని బీజేపీ హై కమాండ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.