Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ సినిమా ఆ ఒక్కటి అడక్కు లో నిక్కరు, లాల్చి ఏసుకొని భుజం మీద కండువా ఏసుకొని రావు గోపాలరావు కనిపిస్తూ చెప్పిన డైలాగ్స్ ఎంత కిక్కు ఇచ్చాయో అందరికి గుర్తుండే వుంటుంది. ఆ సినిమా చూస్తే ఇప్పటికే రావు గోపాలరావు పాత్రే మనసులో మెదులుతుంది. ఇప్పుడు ఆయన కొడుకుగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో నటనతో దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న నటుడు రావు రమేష్. తాజాగా దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో చొక్కా, నిక్కరుతో ఆయన చేసిన రొయ్యల నాయుడు పాత్ర అచ్చం పాత సినిమాలో రావు గోపాలరావు తరహాలో ఉండటం విశేషం. అలాగే ఆ డైలాగ్ ఉచ్చారణ కూడా అచ్చుగుద్ది నట్లు తండ్రిని తలపిస్తుంది అని సినిమా జనం అందరు అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు రావు గోపాలరావు క్రేజ్ కూడా దువ్వాడ జగన్నాధమ్ చిత్రానికి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. అల్ రెడీ రావు రమేష్ డీజే ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ కూడా భాగా ఆకట్టుకుంది.