Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఢిల్లీ కుర్రాడు చేతన్ కక్కర్ గూగుల్ సంస్థ నుంచి రూ. 1.27 కోట్ల ఆఫర్ దక్కించుకున్నాడు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీ నుంచి అత్యధిక ఆఫర్ ను దక్కించుకున్న విద్యార్థిగా చేతన్ రికార్డు సృష్టించాడు. ఏడాదికి 1,19,000 డాలర్లు(రూ. 1.27 కోట్లు సుమారుగా) ఇచ్చేందుకు గూగుల్ ఆఫర్ చేసింది. ఇప్పటివరకూ డిటుయు క్యాంపస్ నుంచి అత్యధిక ఆఫర్ రూ. 93 లక్షలగా ఉంది. ఈ రికార్డును చేతన్ చెరిపేశాడు.

కాగా చేతన్ తల్లిదండ్రులిద్దరూ టీచింగ్ ప్రెఫెషన్‌లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో చేతన్ తల్లి రీటా రసాయన శాస్త్ర విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అతడి తండ్రి సుభాష్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చేతన్ తన చదువు పూర్తి కాగానే 2016లో ఈ ఆఫర్‌ను అందుకోనున్నాడు. గూగుల్ ఆఫర్ తనకు ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉందంటున్నాడు చేతన్.