Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు, హీరోల‌కు కాస్త కోప‌రేటివ్ గా ఉంటారు. అలా అని అంద‌రూ అలానే ఉంటార‌నుకుని ఎడాపెడా గోకేస్తే ఒక్కోసారి బొక్క బోర్లా ప‌డాల్సి ఉంటుంది. ఈ మ‌ధ్య ఓ ద‌ర్శ‌కుడు ఇలానే ఓ హీరోయిన్ ను ట్ర‌య్ చేయ‌బోయి అభాసు పాల‌య్యాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముద్దుగా, బొద్దుగా చూడ‌గానే నోరూరించే చాకెలెట్ బేబీలా ఉంటే ఈ హీరోయిన్ కు ఆ బ‌క్క ప‌లుచ‌ని డైరెక్ట‌ర్ గాలం వేసాడ‌ట‌.

నేను ట‌చ్ చేసిన హీరోయిన్లు ఇప్పుడు ఎక్క‌డో ఉన్నారు. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మంచి పోజిష‌న్ లో ఉన్న‌వాళ్లు నేను లిఫ్ట్ ఇచ్చిన వాళ్లే. ఈ రెండ‌క్ష‌ల‌రాల హీరోయిన్ ను నేనే ఇంత‌దాన్ని చేసాను. అని ఏవేవో క‌థ‌లు చెప్పాడ‌ట‌. నువ్వు కూడా ఆ స్థాయికి రావాలంటే న‌న్ను న‌మ్ముకో అని ఓ రేంజ్ లో గోకాడ‌ట‌.

అయితే పూర్తి ప్రొఫెష‌న్ లా ఉండే ఆ హీరోయిన్ నీ ప‌ర్స‌నాలిటీ ఏంటి? నా ప‌ర్స‌నాలిటీ ఏంటి? అస‌లు నువ్వు మాట్లాడిన దానికి అర్ధం ప‌ర్ధం ఉందా అంటూ ఏకిపారేసింద‌ట‌. అంత‌టితో ఊరుకోకుండా త‌న‌కు క్లోజ్ గా ఉండే హీరోకు ఈ విష‌యం చెప్పింద‌ట‌. ఆ హీరో ఆ ద‌ర్శ‌కుడ్ని కార్ వ్యాన్ లోకి పిలిచి ఇదేం ప‌ని నీకు అంటూ క్లాస్ పీకాడట‌. భార్యా పిల్ల‌లు ఉండి కూడా ఇలాంటి గోకుడు కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటే ప‌రిస్థితి ఇలానే ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.