Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కాశ్మీర్‌ పేరు వింటే చాలు ప్రకృతి సౌందర్య వీథుల్లో విహరిస్తున్న దృశ్యమే కనురెప్పల మాటున కదలాడుతుంది. అదికూడా డాల్‌ లేక్‌ తీరాన పలు వర్ణాల్లో ఆహ్వానం పలికే టులిప్‌ గార్డెన్‌ను చూస్తే… ఆహా! చూస్తే ఏంటి… చూడాల్సిందే. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ టులిప్‌ పూలవనంలోకి అడుగుపెట్టగానే ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు, ఆరెంజ్‌, లేతనీలం, మెజెంతా రంగులు పలకరిస్తాయి. ప్రధానంగా కనిపించే ఈ రంగులే కాకుండా మరెన్నో రంగులు కనువిందుచేస్తాయక్కడ. పచ్చని తివాచీ పరిచిన కొండల నడుమ గాలికి వయ్యారంగా కదులుతూ టులి్‌పలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. టులిప్‌ పూల ఫెస్టివల్‌ ప్రతి ఏడాది ఏప్రిల్‌ నెలలో జరుగుతుంది. ఈ సీజన్‌లోనే పువ్వులు బాగా వికసించి దూరంనుంచి చూస్తే రంగురంగుల సిల్క్‌ తివాచీ పరిచినట్టే కనిపిస్తుంది. అందుకని ఏప్రిల్‌ – మే నెలల్లో టులిప్‌ పూబాలల ఉద్యానవనాన్ని సందర్శిస్తే ప్రకృతి ఒడిలో పరవశించిపోవచ్చు. ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో 60 రకాలతో ఉండే టులిప్‌ గార్డెన్‌ను జీవితంలో ఒక్కసారన్నా చూడాల్సిందే. ఈ పూవులు ఉష్ణోగ్రతను బట్టి 15 నుంచి 20 రోజులు వికసించి ఉంటాయి.