Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్ళు వున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, పార్టీలు అప్పుడే ఎవరి ఆలోచనలో వాళ్ళు వున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాకవులు, ఉద్యమ నాయకులు అందరు ఏకమై బడుగు బలహీన వర్గాలు కోరుకునే తెలంగాణ కోసం కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ తో పోరుకు సిద్ధమవుతున్నారు. ఇదే పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూడా రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి తానే రాజుని అని ఈ సందర్భంగా గద్దర్ చెబుతున్నాడు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్న తెలంగాణ ని ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కబ్జా చేసేసి, తన సొంత సొత్తుగా భావిస్తుందని ఈ సందర్భంగా గద్దర్ ఆరోపించారు. ప్రజా పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ రాజకీయ నాయకులు హైజాక్ చేసి ఇప్పుడు దోచుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక భూస్వామ్య రాజకీయ నాయకుల ఆటలు సాగవని, ప్రజల మద్దతుతో వారిని ఓడించి, నిజమైన తెలంగాణ ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి తానే రాజుని అని చెప్పుకున్నారు.