Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండి ఓ అధికారి చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. జాతీయ జెండాను ఎలా గౌరవించాలో తెలియని ఆ వ్యక్తి కలెక్టర్ ఎలా అయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం నాగర్ కర్నూల్ లో పోలీస్ పరేడ్ మైదానంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్బంగా కొంతమంది గవర్నమెంట్ మెంట్ ఆఫీసర్ల సమక్షంలో రాజకీయ నేతలు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకలలో మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేయగా అచ్చంపేట ఎమ్మెల్యే తో పాటు మరికొంత మంది నేతలు కూడా సెల్యూట్ చేశారు.

కానీ ఆ జిలా కలెక్టర్ ఈ . శ్రీధర్ సెల్యూట్ చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై శ్రీధర్ మాత్రం తనను సమర్ధించుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు అటెన్షన్ లో ఉన్న సరిపోతుందని. ఇలా కూడా ఉండవచ్చునని. ఈ విషయాన్ని తనకు శిక్షణ ఇచ్చేటప్పుడు తెలుసుకున్నానని చెప్పాడు. కానీ పొలిసు అధికారులు మాత్రం జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు తప్పకుండా సెల్యూట్ చేయాలనీ చేప్పారు. మరి ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా స్పందిస్తారో చూడాలి.