Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత క్రికెట్ భవిష్యత్తు కోసం జూనియర్ స్థాయిలో ఆటను అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. వివిధ వయో విభాగాల కోసం ప్రత్యేక బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలని ద్రవిడ్ సూచించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ అకాడమీలు భారీ ఫీజులు తీసుకుంటూ సరైన శిక్షణ ఇవ్వడం లేదని, ఒక ప్రత్యేక పాలసీ రూపొందిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు.

క్రికెట్ కోచింగ్ ఇప్పుడు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని… ప్రతి ఏటా దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకునే రాష్ట్ర క్రికెట్ సంఘాలు కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత క్రికెట్ కోచింగ్‌కు కేటాయిస్తే పేదవారికి కూడా న్యాయం జరుగుతుందని ద్రవిడ్ వ్యాఖ్యానించారు.

అండర్-14 స్థాయిలో రాణించకపోతే తమ పిల్లాడి ప్రపంచం ముగిసిపోయినట్లు తల్లిదండ్రులు భావించరాదని ఆయన చెప్పారు. ఒక వేళ ఆటలో ముందుకు వెళ్లకపోయినా తిరిగి తమ చదువులో కొనసాగే ధైర్యం వారికివ్వాలన్నారు. సచిన్ టెండూల్కర్‌ది ప్రత్యేకమైన ఘనత అని, అతడితో పోల్చి ఒత్తిడి పెంచవద్దని ద్రవిడ్ కోరాడు.