Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక విచారణ నేడు సిబిఐ కోర్టులో జరగనుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ విచారణ జగన్ రాజకీయ భవిష్యత్తుకు సంబందించినది.జగన్ ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ సమయంలో జగన్ బెయిల్ రద్దయితే ? వైఎస్ఆర్ సిపి పార్టీ భవిష్యత్తుతో పాటు జగన్ రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారం లోకి వెళ్ళినట్లే. ప్రస్తుతం ఈ అంశమే వైసిపి నేతలకు కలవరపెడుతోంది. నేడు జగన్ బెయిల్ రద్దు అంశం సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది.ఈ టైమ్ లో జగన్ ఢిల్లీలో ఉండడంతో ఏపీ తాజా రాజకీయం ఆసక్తిగా మారింది.

అక్రమాస్తులకేసులో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. జగన్ బయట ఉంటె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అతడి బెయిల్ ని రద్దు చేసి జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించాలని సిబిఐ కోర్టు ముందు గట్టిగా వాదిస్తోంది. నేడు జరగబోయి విచారణలో కూడా తన వాదనని వినిపించబోతోంది.సాక్షిలో జరిగిన ఇంటర్ వ్యూ లో మాజీ ప్రధాన కార్యదర్శి జగన్ కేసులగురించి ప్రస్తావించారు.కేసు విచారణలో ఉన్న సమయంలో ఈ విధంగా వ్యవహరించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అని సిబిఐ అంటోంది.

కాగా ఈ సమయంలో జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఈ చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.తమ ఎమ్మెల్యే లను టీడీపీలో చేర్చుకుని వారికి చంద్రబాబు మంత్రి పదవులు కట్ట బెట్టారని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి జగన్ వెళ్లారు. దీనితో టిడిపి నేతలనుచి సెటైర్లు వినిపిస్తున్నాయి.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వచ్చిన పనివేరు ..అయన సొంత మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు అని ఎద్దేవా చేశారు.