Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు పెను సవాల్ గా మారనున్నాయి. కొత్త రాష్ట్రంలో పాలన చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ప్రజల్లో మెల్లగా అసహనం రాజుకుంటోంది. విభజన హామీలను అమలుచేయకపోవడం, కొత్త రాజధాని పనులు నమ్మకంగా సాగకపోవడం, రాజధాని ఎర్పడ్డ ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది ఆశాజనకంగా లేకపోవడం, అప్పటికీ ఇప్పటికే నిరుద్యోగ సమస్యలో తేడా లేకపోవడం, మావోయిస్టు సంఘాల పట్ల అమానుషంగా ప్రవర్తించడం, బీసీల డిమాండ్లు నెరవేర్చకపోవడం వంటి కారణాల వలన అసంతృత్తి చెలరేగుతోంది.

ఈ అసహనాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా వైసీపీ, జనసేనలు మంచి జోరు మీదున్నాయి. ఒకవైపు పవన్ సామాజిక సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలను ఆయుధాలుగా చేసుకుని ముందుకెళుతుంటే జగన్ చంద్రబాబునే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో ఇమేజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ ఇన్ని అసంతృప్తుల మధ్య ప్రజలు నిజంగా ప్రత్యాన్మాయం కోరుకుంటే ఈ రెండు పార్టల్లో ఎవరిని ఎంచుకోవాలి అనే సంశయం రాక మానదు.

ఎందుకంటే జగన్ పరిస్థితి చూస్తే అవినీతి ఆరోపణలు, పార్టీ, నేతల విషయంలో వన్ మాన్ షో, పరిస్థితులు, రాజకీయాంశాలు పట్ల పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం వంటివి మైనస్ లుగా కనిపిస్తుంటే మరోవైపు పవన్ విషయంలో పార్టీకి సరైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం, అన్ని ప్రాంతాల్లో బలమైన నేతలు లేకపోవడం, ఆవేశంగా ఆరంభిస్తారేగాని ఆచరణలో సహనం ఉండదనే ఉద్దేశ్యం వంటిని డ్రా బ్యాక్స్ గా నిలుస్తున్నాయి. కనుక ప్రజలకు ఏ పార్టీపైనా సరైన గురి కుదరడం లేదు. కాబట్టి ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల పైగానే సమయం ఉంది కాబట్టి ఈలోపు జరిగే పరిణామాలను బేరీజు వేసుకుని ప్రత్యాన్మాయం కావాలనుకుంటే ప్రజలే ఒక నిర్ణయం తీసుకోవాలి.