Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ మధ్యకాలంలో సెలెబ్రిటీలు ధరించే దుస్తులపై పెద్ద చర్చే సాగుతోంది. ఈ మధ్యన హాట్ బ్యూటీ దీపక పదుకొనె ఓ ఫోటోషూట్ లో హాట్ గా కనిపించింది. ఆ సందర్భంగా ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్లు మండిపడ్డారు. హాలీవుడ్ వెళ్లి భారతీయుల పరువు తీస్తున్నావంటూ కామెంట్లు పడ్డాయి. దంగల్ చిత్రం లో నటించిన ముద్దు గుమ్మా ఫాతిమా సనా బీచ్ లో స్విమ్ షూట్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

పవిత్ర రంజాన్ మాసంలో అలాంటి బట్టలు ధరించడం ఏంటని ఫాతిమాకు విమర్శలు ఎదురయ్యాయి.సోషల్ మీడియాలో కూడా చివాట్లు తప్పలేదు. దీనితో సెలెబ్రిటీలు ధరిస్తున్న దుస్తులపై పెద్ద చర్చే జరుగుతోంది. మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ రవీనా టాండన్ పద్దతిగా చీర కట్టుకున్నా చివాట్ల నుంచి తప్పించుకోలేక పోయింది. ఇదంతా ఆమె చేసుకున్నదే. అందమైన చీరని ధరించిన రవీనా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతటితో ఊరుకోకుండా.. ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను.. నన్ను చూసి మీరంతా పద్దతిగా, సాంప్రదాయ బద్దంగా, హిందూ భక్తురాలిలా ఉన్నానని అంటారా ? అంటూ వెటకారంగా ట్వీట్ చేసింది. చీర కట్టుకుంటేనే సాంప్రదాయ బద్దంగా ఉన్నట్టా అంటూ పరోక్షంగా ప్రశ్నించింది. దీనితో నెటిజన్లు రవీనాపై తిట్లదండకం మొదలెట్టారు. దీనిపై ఆ తరువాత రవీనా వివరణ ఇచ్చింది. నా వ్యాఖ్యలు భాదించి ఉంటె క్షమించండి.. చీర గురించి నా అభిప్రాయాన్ని అపార్టం చేసుకుంటారనుకోలేదు అంటూ రవీనా వివరణ ఇచ్చింది.