Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చీరకట్టు అన్నది భారతీయ సాంప్రదాయానికి ప్రతిక. భారతదేశంలో రకరకాల సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి. వారి వారి సంప్రదాయాలు అనుసరించి చీరకట్టు ఉంటుంది. అయితే, కొంతమంది మహిళలకు అసలు చీర ఎలా కట్టుకోవాలో తెలియదు. కొంతమంది చీర కట్టుకోవడం అంటే అదో పెద్ద తంతు అని ఏదో సింపుల్ గా చాప చుట్టినట్టు చుట్టేసుకొని వెళ్తుంటారు. అయితే, చీరకట్టులోనే అందం ఉన్నది అని వారికి తెలియదు. చీరను ఎంత అందంగా కట్టుకుంటే.. మహిళలు అంత అందంగా కనిపిస్తారు. ఫ్యాషన్ డ్రెస్ లు, పంజాబీ డ్రెస్ లు వేసుకునే వారి కంటే.. చీరకట్టుకున్న వాళ్ళే అందంగా కనిపిస్తారట. ఇక, చీరను చాలా సింపుల్ గా ఎలా కట్టుకోవాలో చెప్తూ.. ఇటీవలే ఓ వీడియోను యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాది. దాదాపుగా ఆ వీడియో ను ఇప్పటివరకు 9లక్షల అరవై వేల మంది చూశారు అంటే అర్ధం చేసుకోవచ్చు. చీరలోని గొప్పదం ఏమిటో.