Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చిన్నారుల కోసం సరికొత్త బ్యాంకు ఖాతాను ప్రవేశపెట్టింది. 18 యేళ్ల లోపు పిల్లలకు పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇందుకోసం రెండు స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి ఎస్.బి.ఐ పెహ్లీ ఉదాన్. రెండోది ఎస్.బి.ఐ. పెహ్లా కదం అని నామకరణం చేసింది.
మూడు నెలల కిందట 10 సంవత్సరాల పాటు మైనర్లు వ్యక్తిగతంగా ఖాతా నిర్వహించేందుకు, ఏటీమ్, చెక్ బుక్‌లు ఉపయోగించేందుకు అనుమతిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తాజాగా ఈ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఎస్.బి.ఐ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఎస్బీఐ” ‘పెహ్లీ ఉదాన్’ అనేది పదేళ్లపాటు చిన్న వయసు పిల్లలు ఒక్కొక్కరుగా నిర్వహించే సేవింగ్స్ ఖాతా. ఇక ‘పెహ్లా కదం’ అయితే చిన్న వయసున్న అన్ని రకాల వారు జాయింట్‌గా (అతను లేక ఆమె) తల్లిదండ్రి లేదా గార్డియన్ ఆపరేట్ చేయొచ్చుని వివరించింది.