Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో మారు తన ప్రశ్నల పరంపరని కొనసాగించారు. తన ప్రశ్నలన్నీ బిజెపి కి తగిలేలానే గురి పెట్టారు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నా కూడా పవన్ సమకాలీన అంశాలపై స్పందిస్తున్నాడు.గత కొద్దీ కాలంగా భారతీయ జనతా పార్టీ పై తీవ్ర స్వరం వినిపిస్తున్న పవన్ తాజాగా మరోమారు బిజెపి పై ప్రశ్నస్త్రాలు సంధించారు. 5 అంశల ప్రాతిపదికగా ఆయన బిజెపి పై ప్రశ్నల వర్షం కురిపించారు. గోవధ, పెద్ద నోట్ల రద్దు, దేశభక్తి, ప్రత్యేక హోదా, వేమూరు రోహిత్ ఆత్మహత్య లపై జనసేనాని పోరాటం చేయదలచుకున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ లోని ముఖ్య నేతలతో పవన్ జరిపిన సమావేశం లో ఈ అంశాలపై జనసేన పార్టీ పోరాటం చేయాలనీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా నేడు ప్రశ్నలు సంధించారు. గోరక్షణ కోసం బిజెపి నేతలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని పవన్ ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో గో మాంసాన్ని ఎందుకు నిషేదించలేదని ఆయన నిలదీశారు. లెదర్ బెల్టులు, చెప్పులను బిజెపి నేతలు ఎందుకు నిషేదించలేదని ఆయన ప్రశ్నించారు. కాగా తాను రెండవ అంశంగా రోహిత్ వేముల ఆత్మహత్య పై రేపు స్పందిస్తానని పవన్ అన్నారు.కాగా జనసేన అధినేత పవన్ బిజెపి తో పోరాటం వైపే అడుగులు వేస్తున్నట్లు పరిణామాలను బట్టి అర్థమవుతోంది. పవన్ బిజెపి తీరుని తీవ్రంగా తప్పు బడుతుండడంతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.