Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన  18వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఇంటర్నెట్ లవర్స్ కు  కొన్ని ఆఫర్లను ప్రకటించింది. లో ఇంటర్నెట్  స్పీడ్ సమస్యకు పరిష్కారంగా  బఫర్  ఫ్రీ అనుభవం కోసం  యాక్స్ లేటర్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి  తీసుకురానుంది.  గూగుల్ స్టేషన్ అనే కొత్త వై ఫై స్టేషన్,  ‘యూ ట్యూబ్  గో’ అనే వీడియో యాప్ ,   క్రోమ్ వెబ్ బ్రౌజర్ కోసం  ఒక ఆఫ్ లైన్ ఫీచర్ ,  గూగుల్ ప్లే కోసం  ఫాస్టర్ లోడింగ్   ఫీచర్ను  ప్రకటించింది. దీని ద్వారా ఈ సంవత్సరాంతానికి  ఇండియాలో యూజర్లకు బఫర్ ఫ్రీ అనుభవాన్ని అందించనున్నట్టు గూగుల్ ఇండియా రాజన్ ఆనందర్   మంగళవారం ప్రకటించారు. తమ వినూత్న ఉత్పత్తులు, మరియు వేదికల ద్వారా  మూడు కీలక ప్రాంతాల్లో  బిలియన్ వినియోగదారులకు  మంచి ఆన్లైన్ అనుభవాన్ని అందించడానికి పనిచేస్తున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా చెప్పారు.

భారతీయ రైల్వే స్టేషన్లలో వై-ఫై అందించడానికి గాను రైల్వేల భాగస్వామ్యంతో  రైల్ టెల్  ను ఆవిష్కరించిన గూగుల్..  గూగుల్ స్టేషన్ అనే కొత్త వైపై స్టేషన్ ను  ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచంలోనే  వేగవంతమైన వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్టు సేన్ గుప్తా తెలిపారు. మాల్స్, కెఫే, రవాణా స్టేషన్లలో కూడా లో-బ్యాండ్విడ్త్ కనెక్షన్ వినియోగదారులు  ఈజీగా వై ఫై ని అందుకోవచ్చని చెప్పారు.  దీని కోసం సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ,  ఇతర భాగస్వాములతో కలిస పని చేయనున్నట్టు చెప్పారు.   అలాగే ఇంగ్లీష్ తో పాటు  రాబోయే సంవత్సరాల్లో ఇతర ప్రాంతీయ భాషలపై  కేంద్రీకరిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త మెసెంజర్ యాప్ అల్లో  గూగుల్ అసిస్టెంట్ లో హిందీని చేర్చనున్నట్టు  వెల్లడించింది.  ఇంటర్నెట్ యూజర్లలో హిందీ సెర్చ్ 50 శాతం పెరిగిందని గూగుల్ వివరించింది.
ఇంటర్నెట్ వినియోగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటని   వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ చెప్పారు యూజర్ బేస్, స్మార్ట్ఫోన్ స్వీకరణ అభివృద్ధి  చెందుతుందున్నారు. ఈ నేపథ్యంలోనే 2020 నాటికి  350 మిలియన్ల నుంచి 650 మిలియన్లకు పెరుగుతారని చెప్పారు.  2016 లో  స్మార్ట్ఫోన్ బేస్ 300 మిలియన్ల నుంచి 500 మిలియన్లకు పెరుగుతుందని భరోసా ఇచ్చారు.