Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శరీరంపై అద్భుతమైన ప్రభావం చూపుతూ అనేక రకాల దీర్ఘకాలిక,తాత్కాలిక వ్యాధుల నుంచి విముకి కల్పించే డాక్టర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ మ్యూజిక్ థెరపీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ నెల 6వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్‌లో నిర్వహించిన సుదీర్ఘమైన మ్యూజిక్ థెపరీ పాఠం గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వామీజీ సిడ్నీలో నిర్వహించిన మ్యూజిక్ థెరపీ క్లాస్ గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించడం పట్ల ఆయన అభిమానులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మందులు వాడుతూనే ఈ సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల నాడీ వ్యవస్థ, శరీరంలోని వివిధ అవయాలు స్వాం తన పొందగలుగుతాయని, రోగవిముక్తమవుతాయని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వయొలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం, సంగీత కళాకారులు రామదాసు, వి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.