Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రముఖ కవి, ఙ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, రచయిత సి.నారాయణరెడ్డి(సినారే) కన్నుమూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌ చికిత్స పొందుతూ అంతిమ‌ శ్వాస విడిచారు. 1931 జూలై 29న కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సినారే.. హైద‌రాబాద్‌ ఉస్మానియా నుండి తెలుగు సాహిత్యంలో పీజీ చేసి, డాక్టరేట్‌ పొందారు. సీనారే ర‌చ‌న‌లు, సాహిత్యం, క‌విత్వం, పాటలకు పుల‌కించ‌ని తెలుగువాడు లేడు. ఆయ‌న సాహిత్యానికి అందించిన సేవ‌ల‌కు గొప్ప గుర్తింపు ద‌క్కింది. 1988లో `విశ్వంభర కావ్యానికి ఙ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు.

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931), తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ తరువాత ఙ్ఞానపీఠ్‌ అందుకున్న రెండో వ్యక్తి సినారే. 71 సినిమాలకు పాటలు రాసిన సినారే.. అటుపై రాజ‌కీయాల్లోనూ సేవ‌లందించారు. రాజ్యసభసభ్యుడిగా నియ‌మితుల‌య్యారు. 1977లో పద్మశ్రీ అవార్డును కైవ‌శం చేసుకున్నారు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు అజ‌రామ‌రాలు.. ఆయ‌న లేక‌పోయినా ఆయ‌న పాట‌తో భువి ఎప్ప‌టికీ పుల‌కిస్తూనే ఉంటుంది. సీనారే మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌తో పాటు, సాహితీ లోకానికి తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ శాంతించాల‌ని సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా