Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం యువతరం ఆలోచనలు అందం, డబ్బు ఈ రెండింటి చుట్టూనే తిరుగుతుంది. అందుకే యువతరం లో ప్రస్తుతం స్వచ్చమైన ప్రేమలు ఎక్కడ మచ్చుకైన కనిపించడం లేదని ప్రస్తుతం చాలా మంది పెద్దల మాట. తాజాగా ఓ దర్శకుడు ఇదే విషయం మీద సంచలన కామెంట్స్ చేసారని ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ దర్శకుడు ఆ మధ్య ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రేమ, పెళ్లి అనే బంధాలు గురించి మాట్లాడుతూ ఓ కామెంట్స్ చేస్తినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యువతరంలో అసలు ప్రేమ అనేది లేదని, వారి మాధ్య ఉన్నదీ కేవలం ఆకర్షణ మాత్రమె అన్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఎలా అయిన ఆ అమ్మాయిని అనుభావించాలనే ఆలోచన ప్రస్తుతం కుర్రాళ్ళలో ఎక్కువగా ఉందని అన్నట్లు తెలుస్తుంది. చాలా వరకు అమ్మాయిల హత్యలు హత్యాచారాలు కుర్రాళ్ళలో ఉన్న ఆ రకమైన ఆలోచనల నుంచే పుట్టుకొస్తున్నాయని అన్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తుంది.

అయితే అబ్బాయిలు అలా వుంటే అమ్మాయిల ఆలోచనలు మొత్తం డబ్బు, అందం చుట్టూ తిరుగుతుందని అ దర్శకుడు కామెంట్స్ చేస్తినట్లు తెలుస్తుంది. ఎంత సేపు వారి అందానికి ఇచ్చే ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వరని, అలాగే డబ్బున్న అబ్బాయి అయితే వాడితో తిరగడానికి, అవసరం అయితే వాడి కోరికలు తీర్చడానికి కూడా సిద్ధమైపోతున్నారని ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. అందుకే పెళ్లి అనే బంధం మీద పూర్తిగా విరక్తి కలిగిందని, సమాజంలో ఇలాంటి సంబంధాలు చూస్తూ వుంటే చిరాకు పుడుతుందని కాని ఎవ్వరం ఏమీ చేయలేమని ఆయన అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా ఇంతకాలం తన మనసులో ఫీలింగ్స్ అన్ని కూడా ఒక్కసారి బయటకు ఆ దర్శకుడు వదిలేసాడని ఇండస్ట్రీ జనం అనుకుంటున్నారు.