Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. చర్మక్యాన్సర్‌ మెలనోమా అనే వ్యాధి సోకిన వారికి కొన్ని రకాల జన్యుమార్పులు తలెత్తుతుంటాయి. పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే గాసీపిన్‌ అనే పదార్థం.. ఈ జన్యుమార్పులను బాగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే పండ్లలోని గాసీపిన్‌ను మన శరీరం ఎలా స్వీకరిస్తుంది.. దాని ప్రభావం క్యాన్సర్‌ కారక జన్యుమార్పులపై ఎలా పడుతుంది? అనే దిశగా మరికొంత పరిశోధన జరిగితే.. మరిన్ని కొత్త సంగతులు వెలుగు చూస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే చర్మ కేన్సర్ మాత్రమే గాకుండా కాన్సర్‌లోని రకాలకన్నింటిపై తాజాపండ్లు, తాజా కూరగాయలను తీసుకోలడం ద్వారా ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.