Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మగ నెమలి ఆడ నెమలితో సంభోగానికి దూరంగా ఉంటుందని, అందుకే మన దేశంలో నెమలిని జాతీయ పక్షిగా గౌరవిస్తారని రాజస్థాన్ హై కోర్టు న్యాయమూర్తి ఒకరు రీసెంట్ గా ఓ కేసులో భాగంగా ప్రస్తావించిన విషయం అందరికి తెలిసిందే. అయితే దీనిపై భాలీవుడ్ లో మాజీ హీరోయిన్స్ ట్వింకిల్ కన్నా, సోనాక్షి, శ్రుతి సోది కాస్తా వ్యంగ్యంగా కామెంట్స్ చేసారు. అయితే వారి కామెంట్స్ మీద ఇప్పుడు కొంత మంది హిందూ సంఘాలు, లాయర్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తుంది. న్యాయమూర్తి మన పురాణాల ఆధారంగా నెమల్లు సంభోగానికి దూరంగా ఉంటాయని చెప్పడం జరిగింది. సైటిఫికల్ కూడా ఇందులో కొంత నిజం వుంది. మిగిలిన జీవులతో పోల్చుకుంటే నెమల్లు సంబోగం చేసే తీరు వేరుగా వుంటుంది. అన్ని జంతువులు, పక్షులు మాదిరి అవి శారీరక సంభోగాన్ని కలిగి ఉండవనే విషయం విజ్ఞాన శాస్త్రంలో కూడా చెప్పబడింది అనే విషయాన్ని కాస్తా బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుసుకోవాలని విమర్శించారు. ఒకరి మీద కామెంట్ చేసే ముందు వారు చెప్పిన మాటలో ఎంత వరకు నిజం వుందో తెలుసుకుంటే సెలబ్రిటీస్ కి కాస్తా గౌరవం ఉంటుందని, అలా కాకుండా చేతిలో ఫోన్, పోస్ట్ చేయడానికి ట్విట్టర్ వుంది కదా అని ఎలా పడితే అలా కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదని నెటిజన్లు సైతం వారి మీద విమర్శలు చేస్తున్నారు. అయితే వారి కామెంట్స్ వచ్చిన విమర్శల మీద ఆ ముద్దుగుమ్మలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.