Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది పాత నానుడే. ఇది నిజమని చాలా సందర్భాల్లో తేలింది. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్న నేతలు ఒకే పార్టీ లో జత కట్టిన సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి.అలాగే వారిమధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా రాజకీయాలకోసం పార్టీ లు మారి ఒకరిని ఒకరు దూషించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే పంథాలో తెలంగాణాలో ఓ సంచలన పొత్తు కు తెరలేవబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.తెలంగాణాలో అధికార టిఆర్ఎస్ పార్టీ మరియు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ల మధ్య పొత్తు కుదిరినట్లు రాజకీయ వర్గాలు ఇటు మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణా టిడిపిలో సీనియర్ నాయకులూ ఉన్నా రేవంత్ రెడ్డి కేద్రంగానే ఆ పార్టీ రాజకీయాలు నడుస్తూ వచ్చాయి. ఒకానొక దశలో రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేసారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అంతలా ఎవరూ విమర్శించలేదంటే అది అతిశయోక్తి కాదు. ఆ తరువాత రేవంత్ ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాక కూడా రేవంత్ విమర్శల దూకుడు తగ్గలేదు.కాగా ప్రస్తుతం రేవంత్ విమర్శల దూకుడుని తగ్గిందనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ ఇప్పటికే మోడీ తో సన్నిహితంగా మెలగడం, ఎంపీ కవిత ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండడంతో ఈ ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ ఎన్డీఏ లో భాగస్వామి. టిఆర్ ఎస్ పార్టీ ఎన్డీఏ తో జతకట్టే నేపథ్యంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీ ల పొత్తు చిగురించే అవకాశం ఉండనే ప్రచారం జరుగుతోంది