Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నయనతార తన మొదటి సినిమానే రజనీకాంత్‌తో చేసింది. ఇప్పుడు తనకంటే చిన్నవాళ్లయిన కుర్రహీరోలతో నటిస్తోంది. శ్రియ కూడా అంతే. రజనీకాంత్‌ సినిమాలో నటించాక చాలామంది యంగ్‌ హీరోల చిత్రాల్లో అవకాశాలు సంపాదించింది. తమన్నా కూడా కథ బాగుంటే ఎవ్వరితోనైనా నటిస్తా అని ఓపెన్‌ ఆపర్లు ఇస్తూ వచ్చింది. కానీ ఆమెకి ఎక్కువగా కుర్ర హీరోలతో నటించే అవకాశాలే వచ్చాయి.
కాగా, తమన్నాకి కమల్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లని తన అభిమాన హీరోలుగా చెబుతుంటుందామె. అయితే వాళ్లతో కలిసి నటించే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు అనుకోకుండా కమల్‌ నుంచి పిలుపు రావడంతో డేట్లు ఖాళీ లేకపోయినా సరే సినిమా చేయడానికి ఒప్పుకొందట తమన్నా. ఎలాగైనా డేట్లు సర్దుబాటు చేస్తానని చెప్పిందట.
కమల్‌లాంటి నటులతో కలిసి తెరపై కనిపించడం ఓ గొప్ప పురస్కారంలాంటిదని ఆమె చెబుతోందట. కమల్‌ కోసం మౌళి అనే సీనియర్‌ దర్శకుడు తయారు చేసిన కథతో ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇటీవల త్రిష కమల్‌తో కలిసి చీకటిరాజ్యంలో నటించింది. ఇప్పుడు తమన్నాకి ఆ ఛాన్సొచ్చిందన్నమాట. అయితే.. కమల్‌తో నటిస్తే.. ముద్దుల సీన్స్‌ వుంటాయిగా అనేదానికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. వున్నాయోలేవో సినిమా వచ్చాకకానీ తెలీదు మరి..!