Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వెలువడిన ఫలితాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రజలు తీర్పు యావత్ భారతాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహకందని విధంగా అప్పటి వరకు అధికారం పై గట్టి నమ్మకంతో ఉన్న సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ల కూటమి ఒక్కసారిగా కుప్పకూలింది. మోడీ ప్రభంజనం ముందు అఖిలేష్, రాహుల్ లు నిలబడలేకపోయారు. ఉన్న 403 స్థానంలో బీజేపీ ఏకంగా 325 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, సమాజ్వాదీ పార్టీ కూటమి మాత్రం కేవలం 54 స్థానాలకే పరిమితమై ఖంగుతింది.

ఈ ఓటమిపై సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర ఓటర్లను సంతృప్తి పరచలేకపోయామని, అందుకే ఓడిపోయామని, ఈ ఓటమికి ఏ ఒక్కరూ ప్రధాన కారణం కాదని అన్నారు. విశ్లేషకులు మాత్రం పార్టీలోని ప్రధాన వ్యక్తుల మధ్య చీలికలు రావాడం, రాజకీయ అనిశ్చితికి అవకాశాలు ఉండటం, మోదీ హవా బలంగా ప్రభావము చూపడంతో ప్రజలు సమాజ్వాదీ పార్టీకి ఓటమిని కట్టబెట్టారని చెప్తున్నారు. ఇకపోతే అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ఉన్నతాధికారులకు తన రాజీనామాను సమర్పించగా బీజేపీ అభ్యర్థి ఎంపికలో నిమగ్నమయ్యారు.