Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

యూపీ లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, అక్కడ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణం మొదలుపెట్టాక ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అవ్యవస్తీకృతంగా వున్న పరిస్థితులు, రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలని అదుపు చేసే పనిలో పడ్డారు. దానికి అన్ని విధాలుగా పక్కా ప్రణాళికతో యోగి తన పనులు చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేసిన 6 జిల్లాలపై ప్రత్యెక ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఒకే సారి 67 మంది ఐపీఎస్ అధికారులని వివిధ ప్రాంతాలకి బదిలీ చేసారు. ఈ బదిలీ వెనుక యోగి చాలా పెద్ద ప్రణాళిక వేసినట్టు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలైన అలహాబాద్, ఘజియాబాద్, లలిత్పూర్, మహారాజగంజ్ జిల్లాల మీద ప్రత్యెక ద్రుష్టి పెట్టి. ఆ జిల్లాలకు అతి ముఖ్యమైన ఐపీఎస్ ఆఫీసర్స్ ని పోస్టింగ్ లో పంపించారు. యూపీలో పెరిగిపోతున్న నేరాలు నియంత్రణలో భాగంగానే ఈ బదిలీలు చేసినట్టు తెలిస్తుంది. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రత్యెక ద్రుష్టి పెట్టి క్రైమ్ రేటు తగ్గించేందుకు యోగి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. ఏది ఏమైనా యోగి పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడ విశ్రాంతి లేకుండా తన పంథాలో అందరిని పరుగెట్టిస్తూ, తాను పరుగెడుతూ, యూపీలో ప్రజలకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు యోగి పరిపాలన మీద జనం సంతోషంగా వున్నారు. ఇకపై ఆ నేరాలు కూడా నియంత్రిస్తే. యూపీలో యోగీ పీటాన్ని ఎవరు కదిలించలేరేమో.