Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కి సుమారు ఎన్ని కోట్లు ఆస్తులు వుండే అవకాశం వుంది అంటే.. అది లెక్కపెడితే కాని చెప్పలేము అంటున్నారు ఐటీ శాఖ అధికారులు. లాలూప్రసాద్ బీనామీ ఆస్తులపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఇన్ కం టాక్స్ అధికారులు లాలూప్రసాద్ బినామీ ఆస్తులకు సంబంధించి కూపీ లాగే పనిలో వున్నారు. సుమారు 100 అధికారులు పాల్గొన ఈ దాడుల్లో లాలూప్రసాద్ యాదవ్ కి సంబంధించి, ఎలాంటి ఆధారాలు లేకుండా బినామీ పేర్లు మీద వున్న ఆస్తులు ఎంత మొత్తంలో వున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ఐటీ అధికారులు వున్నారు. సుమారు వెయ్యి కోట్లు బినామీ ఒప్పందాల మీద వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఢిల్లీ, సమీపంలో 22 ప్రాంతాల్లో ఐటీ శాఖ ఈ దాడులు నిర్వహించింది. లాలూప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులు కలిసి సేకరించిన అక్రమ ఆస్తుల చిట్ట విప్పే ప్రయత్నం జరుగుతుంది. ఈ బినామీ ఆస్తులతో పాటు పన్ను ఎగవేత ఆరోపణల మీద కూడా వివరాలు సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి తెలిపారు. యూపీఎ హయాంలో, బీహార్ లో నితీష్ తో కలిసి ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంగా వున్న సమయంలో లాలూప్రసాద్, అతని కుమారులు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వ చట్టాలని ఉపయోగించుకొని అనేక అక్రమ ఆర్ధిక లావేదేవీలు లాలూ కుటుంబం నడిపించిందని అన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి, దాడులు చేస్తే లాలూ అవినీతి భాగోతం మొత్తం ప్రజలకు తెలుస్తుందని అన్నారు. ఈ దాడుల నేపధ్యంలో ఇప్పటి వరకు లాలూప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ ఐటీ దాడుల్లో లాలూ గారికి సంబందించిన ఎన్ని అవినీతి, అక్రమాలు వెలుగుచూస్తాయో ఇంకా చూడాల్సి వుంది. ఇప్పటికే పశువుల గ్రాసం తినేసాడని లాలూ గురించి దేశం మొత్తం చెప్పుకుంటూ వుంటుంది. ఇప్పుడు ఈ అక్రమ భూములు, బినామి ఆస్తుల విలువ తెలిస్తే అతని అవినీతి భాగోతం ఎ స్థాయికి చేరిందో అందరికి తెలుస్తుంది.