Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈడ్పుతో కూడిన శబ్ధం చేస్తూ హఠాత్తుగా ఊపిరితిత్తుల్లోకి గాలిని పీల్చడాన్ని ఎక్కిళ్లు అంటారు. దీనికి ఆయుర్వేదంలో ‘హిక్కా’ వ్యాధి అని పేరు.

కారణాలు : జీర్ణవ్యవస్థలో కలిగేలోపాలు చాలా వరకు ఈ సమస్యకు కారణం. జీవక్రియలోని వ్యర్థ పదార్థాలను రక్తం నుండి వేరు చేసి బయటికి నెట్టడంలో కిడ్నీలు వాటి క్రియా సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు కూడా ఎక్కిళ్లు వస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం వాతదోషం ప్రకోపించి ఊర్ద్వదిశగా వ్యాపించడం వల్ల ఎక్కిళ్లు వస్తాయి. వేళకు ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన, నరాల బలహీనత, అతి కోపం కూడా ఎక్కిళ్లకు కారణం. సమస్య చిన్నదైనా మానసిక అశాంతి కలగజేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధుల్లో ఎక్కిళ్లు అంతిమ సూచకం కూడా!
ఈ సమస్యకు అడ్డుకట్ట వేసే హోమ్‌రెమిడీ్‌సను ప్రయత్నించండి.
ఫ నెమలి ఈకలను కాల్చిన బూడిదను వ్యాధి తీవ్రతను బట్టి పావు గ్రాము నుంచి అర గ్రాము వరకు రోజుకు 4- 5 సార్లు తేనెలో కలిపి తినిపించాలి.
ఫ మినుములను నిప్పులపై కాల్చిపొగపీల్చినా లేక పాత నులకతాడును కాల్చి ఆ పొగ పీల్చినా ఈ సమస్య తగ్గుతుంది.
గ్లాసు నీటిని హఠాత్తుగా తాగడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది.
కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని చప్పరించాలి.
ఉసిరి పండ్ల రసంలో పిప్పళ్ల చూర్ణాన్ని తేనెలో కలిపి ఇవ్వాలి.
నేల ఉసిరిక రసంలో చక్కెర కలిపి ఇచ్చినా లేక ముక్కుల్లో వేసి పీల్చినా ఎక్కిళ్లు పోతాయి.
మంచిగంథాన్ని చనుబాలతో కలిపి ముక్కుల్లో వేసి పీల్చాలి.
రెండు గ్రాముల నాగకేసర చూర్ణాన్ని, రెండు గ్రాముల తేనె, రెండు గ్రాముల చక్కెరతో కలిపి కప్పు చెరకు రసంతో కలిపి తాగించాలి.
కరక్కాయను నీటిలో చిక్కగా అరగదీసి కప్పు గోరువెచ్చని నీటితో కలిపి తాగించాలి.
ప్రశాంతంగా పద్మాసనం వేసుకుని కూర్చుని గాలిని గట్టిగా పీల్చి బిగబట్టగలిగినంతసేపు బిగబట్టి నెమ్మదిగా వదలాలి. ఇలా 3-4 సార్లు చేస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.