Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ భాదితులను పరామర్శించిన విషయం తెలిసిందే. పవన్ పర్యటన ప్రభావంతో ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. జనసేనాని ఉద్దానం పర్యటనతో ప్రభుత్వం లో కదలిక వచ్చింది. పవన్ పర్యటన ముందు వరకు ఉద్దానం లో ఈ సమస్య ఉన్నట్లు చాలా మందికి తెలియదు. జనసేనాని పర్యటనతో ఈ విషయం పెద్దయెత్తున వెలుగులోకి వచ్చింది. కిడ్నీ వ్యాధి భాదితులను పరామర్శించే క్రమంలో భాగంగా పవన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు.ఉద్దానంలో కిడ్నీ సమస్యతో భాదపడుతున్న వారికి ప్రభుత్వం చేసే సహాయాన్ని 48 గంటల్లో ప్రకటించాలని డిమాండ్ చేసారు.పవన్ కళ్యాణ్ డిమాండ్ ప్రభుత్వం పై బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది.

ఉద్దానంలో కిడ్నీ సమస్యతో భాదపడుతున్న వారికి ఫించన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఉదయం అధికారుల టెలీకాన్ఫెరెన్స్ లో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావు చంద్రబాబుతో ఈ విషయం ప్రస్తావించినపుడు ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య , పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఈ సమస్యని ఛాలెంజ్ గా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమస్యకు శాశ్వత శాశ్వత పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉందని ఆయన అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిచాలని లేకుంటే తాను దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.