Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత్ – ఆస్ట్రేలియా సిరీస్ మొదలై వారం రోజులకు పైనే అవుతోంది. అప్పుడే మూడు వన్డేలు అయిపొయ్యాయి. కానీ మనవాళ్ళు ఒక్కటీ గెలెవలేదు. ప్రతి మ్యాచ్లో బ్యాట్స్ మెన్లు భీభత్సం సృష్టిస్తోంటే.. బౌలర్లు మాత్రం చేష్టలుడిగి చూడాల్సొచ్చింది. జరిగిన మూడు మ్యాచ్ లలో భారత్ తరపున మూడు సెంచరీలు నమోదైనప్పటికీ ఒక్క విజయం కూడా దక్కలేదు. కారణం బౌలర్ల వైఫల్యం. ఆతిధ్య దేశం ఆస్ట్రేలియా మాత్రం హ్యాట్రిక్ విజయాలు సాధించి వైట్ వాష్ పై కన్నేసింది.

ఇప్పుడు నాలుగో వన్డే కాన్బెర్రాలో మొదలైంది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఒపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ దాటిగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి వార్నర్ 34, ఫించ్ 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లోనైనా బౌలర్లు సమిష్టిగా రాణించి గెలుపు రుచి చూస్తారో.. లేదో చూడాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 65/0 గా ఉంది.