Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఏపీ అసెంబ్లీలో మంగళవారం దివంగత నేత భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం జరిగిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిపక్ష నేత జగన్ హాజరు కాకపోవడంపై పలు విమర్శలు వినిపించాయి.భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన సమయంలో డబ్బు పదవుల ఆశచూపి అధికార పక్షం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తోందనే విమర్శలు చేసి టిడిపిని వైసిపి ఇరుకున పెట్టె ప్రయత్నం చేసింది. అప్పట్లో వాటిని టిడిపి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.కాగా భూమా నాగిరెడ్డి మరణం అనంతరం వైసిపి చేస్తున్న విమర్శలు చంద్రబాబుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

భూమా నాగిరెడ్డి కి చంద్రబాబు మంత్రి పదవి ఆశచూపి, వివిధ రకాల ఒత్తిడులకు గురిచేసి పార్టీ ఫిరాయించేలా చేసారని వైసిపి ఆరోపిస్తోంది.భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరినతరువాత మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు క్షోభ పెట్టారని దాని వలనే భూమా చనిపోయారని వైసిపి ఆరోపించింది. మంగళవారం సంతాప తీర్మానం అనంతరం చంద్రబాబు తన ఛాంబర్ నుంచి బయటకు వెళుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి విమర్శలపై స్పందించారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ చెప్పింది వాళ్లే.. ఇప్పుడు ఇవ్వలేదని మాట్లాడుతున్నదీ వాళ్లే అని మండిపడ్డారు.పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవొద్దని వైసిపి గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కదా.. అని చంద్రబాబు అన్నారు. అయినా తాను భూమాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పానా అని అన్నారు. ఎమ్మెల్యేలు ఆరోగ్యం పై శ్రద్ద చూపేలా గతంలో లాగా యోగా వంటి శిక్షణలు ఇస్తారా అని మీడియా ప్రశ్నించగా.. వారితో పాటూ మీకూ(మీడియా) ఇస్తానని చమత్కరించారు.