Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నందమూరి అందగాడు బాలయ్య అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. హిందూపురం ఎమ్మెల్యే గా ఎన్నికైన తరువాత బాలయ్య చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న బాలయ్య వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో బాలక్రిష్ణ నటిస్తున్నాడు.ఈ చిత్రం తరువాత బాలక్రిష్ణ నటించబోయే చిత్రం కూడా కంఫర్మ్ అయింది.

కె.ఎస్. రవికుమార్ తో బాలయ్య తదుపరి చిత్రం ఉండనుంది. బాలక్రిష్ణ ప్రస్తుతం పొలిటీషియన్ కాబట్టి అతడి చిత్రాలపై కూడా మీడియా మరియు ప్రతిపక్షాల కన్ను ఉంటుందనడంలో సందేహం లేదు.బాలయ్య చిత్రాలలో చిన్న వివాదభరిత అంశం కనిపించినా న్యూస్ లో అది పెద్దదిగా మారిపోతుంది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి ‘రెడ్డి గారు’ అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం ఈ విషయాన్ని బాలయ్యకు తెలియజేయలేదట. గతంలో కూడా నరసింహనాయుడు, చెన్నకేశవ రెడ్డి చిత్రాలలో సామజిక వర్గాల పేర్లు టైటిల్స్ చివరిలో బాలయ్య చిత్రాలకు పెట్టారు. కానీ అప్పుడు బాలకృష్ణ రాజకీయ నాయకుడు కాదు. ఈ సమయంలో అలాంటి చిత్రం వస్తే అది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. కుల ప్రస్తావన సినిమాలో ఉంటే బాలయ్య రాజకీయాలను అది ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ‘రెడ్డి గారు’ టైటిల్ కి బాలయ్య ఓకే చెబుతాడా లేదా అనే అంశం ఆసక్తిగా మారింది.