Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సినిమా ప్రమోషన్ విషయంలో కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ విషయంలో సౌత్ లో పెద్ద హంగామా చేయరు కానీ .. బాలీవుడ్ లో అయితే దాని స్టైల్ వేరు. లేటెస్ట్ గా బాలీవుడ్ లో రొమాంటిక్ వీరుడిగా ఇమేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ మరో మగాడికి లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇచ్చాడు ? దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు ? ఏందీ రాజా ఈ కొత్త దోస్తాని ? అని. ఆ వివరాల్లోకి వెళితే రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గా జాసూస్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ మొత్తం సమావేశం అయ్యారు. ఇంతలో రణబీర్ కపూర్ ఉన్నట్టుండి .. దర్శకుడిపై ముద్దుల వర్షం కురిపించాడమే కాకుండా. అతడి పెదాలను ముద్దు పెట్టుకున్నాడు ? ఈ ఆకస్మిక సంఘటనతో అక్కడ ఉన్నవారంతా షాకై చూసారు ? ఎదో హీరోయిన్ తో లిప్ లాక్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకునే వారు కారేమే .. కానీ ఇలా మరో మగాడ్ని ముద్దాడడం సంచలనం రేపింది ? గతంలో మనోడు .. బర్ఫీ సమయంలో కూడా అచ్చంగా ఇలాగె దర్శకుడు అనురాగ్ బసు ను ముద్దాడిన విషయం తెలిసిందె ? మరి రణబీర్ లో దోస్తానా పోలికలు ఉన్నాయా .. లేక పబ్లిసిటీ స్టెంట్ కోసం చేశాడా అన్నది పక్కన పెడితే .. ఇలా మగాడితో లిప్ లాక్ ఇస్తే .. ఏ హీరోయిన్ మాత్రం అతగాడితో లిప్ లాక్ కోరుకుంటుంది చెప్పండి ? అన్నట్టు జగ్గా జాసూస్ వచ్చే నెల 14న విడుదల కానుంది.