Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విశాఖపట్టణాన్ని ఐటీ హబ్‌గా మారుస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తన లక్ష్య సాధనలో భాగంగా ఆయన అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తూ.. ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు విశాఖపట్నంలో తమ శాఖలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా, అంతర్జాతీయ స్థాయి పెద్ద సంస్థలతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌ సంస్థ కూడా విశాఖపట్టణానికి వచ్చేలా చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా గూగుల్ విశాఖలో ఒక కార్యాలయాలన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈనెల 29న చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటీ కంపెనీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులు వస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత గూగుల్ సంస్థ విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది.