Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రైతుల ఆత్మహత్యల సమస్యలపై పరిష్కారం రాత్రికి రాత్రే పరిష్కారం కాదని, తప్పని సరిగా సమయం పడుతుందని.. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రెండు రోజుల నుంచి రైతుల ఆత్మహత్యలపై సభలో చర్చజరుగుతున్నదని.. ప్రతిపక్షాల నుంచి మంచి సూచనలు సలహాలు వస్తే స్వీకరిస్తామని చెప్పమని.. దురదృష్టవశాత్తు వారి వద్దనుంచి ఎటువంటి సలాహాలు రాలేదని.. అధికారపక్షంపై బురదజల్లెందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసేశారు. ఆత్మహత్యలపై మూలాలలోకి వెళ్లి పరిశీలించాలని హైకోర్ట్ ఆదేశించిందని.. హైకోర్ట్ ఆదేశాన్ని తూచా తప్పకకుండా పాటిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో పేర్కొన్నారు.

మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు కమిషన్ కాకతీయ అన్నారని..ఆయన మండిపడ్డారు. ఇండియా లో ఎక్కడా లేని విత్తనకంపెనీలో హైదరాబాద్ లో ఉన్నాయని.. రాష్ట్రంలో పంటలు పండే నేలలు ఎన్నో ఉన్నాయని.. వాటిల్లో బంగారం పండుతుందని చెప్పారు. కరెంటు సమస్యను అధికమించామని.. రైతులకు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం రాత్రికి రాత్రే కాదని.. పరిష్కారం కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.