Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మూడు టెస్టుల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో చటేశ్వర పూజారా రెండు హాఫ్ సెంచరీలతో రాణించడంపై టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే వెస్టిండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన అతనికి కొన్ని సూచనలు చేసినట్లు కోహ్లి  ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ప్రధానంగా అతని స్ట్రైక్ రేట్కు సంబంధించి పూజారాతో చర్చించిన విషయాన్ని కోహ్లి తాజాగా వెల్లడించాడు.

విండీస్ పర్యటనలో అతనికి స్ట్రైక్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై చర్చించాల్సి వచ్చిందన్నాడు. తన ప్రకారం చూస్తే పూజారా బ్యాటింగ్లో ప్రస్తుత మార్పుకు అదే కారణమన్నాడు. ‘భారత గడ్డపై చూస్తే పూజారాకు ఘనమైన రికార్డు ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలపై నమోదు చేసిన డబుల్ సెంచరీలే అతని ప్రతిభకు నిదర్శనం. అతని నుంచి కోరుకుంటున్నది అదే. అతని బ్యాట్ మరింత పదునుగా ఉండాలనేది మా కోరిక. అంతేగానీ అతన్ని ఒత్తిడిలోకి నెట్టాలనేది మా లక్ష్యం కాదు.

ఆ క్రమంలోనే విండీస్ పర్యటనలో పూజారాతో చర్చించా.  స్ట్రైక్ రేట్ను కాపాడుకోమని చెప్పా. అదే న్యూజిలాండ్ తో మ్యాచ్లో ఉపయోగపడింది. మరింతగా శ్రమించి తన ఫామ్ను చాటుకున్నాడు. ఇదే ఆర్డర్లో తనను పంపాలని నిబంధన పూజారా ఎప్పుడూ పెట్టలేదు. దాంతో పాటు ఆ జోన్ లో ఆడటానికి వెళ్లను అని కూడా చెప్పలేదు. అటువంటి వ్యక్తిత్వమే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే మేము కోరుకుంటాం కూడా’ అని కోహ్లి తెలిపాడు.