Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ పురుషులు, మహిళల మధ్య అంతరాలు తగ్గుతూ వస్తోంది. గతంలో పురుషులు కొన్ని పనులు మాత్రమే చేయాలని, కొన్ని పనులు మహిళలు మాత్రమే చేయాలనే సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే, నేటి ఆధునిక కాలంలో ఈ అంతరాలు దాదాపుగా తగ్గాయనే చెప్పవచ్చు. నేడు పురుషులు చేస్తున్న పనులు స్త్రీలు, స్త్రీలు చేస్తున్న పనులు పురుషులు చేస్తూ ఏ రంగంలో తాము దేనికీ తీసిపోమని నిరిపిస్తున్నారు నేటి కొత్త తరం యువత. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. భారత్‌లో మహిళలు పురుషులకన్నా సగటున ఏడాదికి 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని ప్రపంచ ఆర్థిక ఫోరం ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చుసుకున్నట్లయితే ఈ సంఖ్య 39 గా ఉంది. పురుషులు, స్త్రీల మధ్య న్తరాలు తోలిగిపోవాలంటే మాత్రం ఇంకా 170 సంవత్సరాలు పడుతుందట. అయితే ఈ పర్తిశోదనలో కేవలం ప్రపంచంలోని ఆరు దేశాల్లో మాత్రమే మహిళలు, పురుషుల కంటే ఎక్కువ పనిచేస్తారని తేలింది. . ఆ ఆరింటిలో మూడు దేశాలు స్కాండినేవియా, ఫిన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్. వేతనం లభించే పని వరకే చూస్తే పురుషులే మహిళల కన్నా 34 శాతం ఎక్కువగా కష్టపడుతున్నారు. దీనికి కారణం మహిళలు కార్యాలయాల్లో చేసే పని కన్నా వేతనం రానటువంటి ఇంటిపని, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు