Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అసలే దేశంలో నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతున్న వారికి రానున్న రోజుల్లో మరింత కష్ట కాలం ఎదురవ్వనుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ‘ఎ’గ్రేడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉన్నట్టుండి నాన్ పెర్ఫార్మర్‌గా మారుతున్నారనే ముద్ర వేసి వారి ఉద్యోగాలను తీసేస్తున్నాయి ప్రముఖ ఐటి కంపెనీలు. దీంతో చాలా మంది నిరుద్యోగ సమస్యలతో రోడ్డున పడనున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఐటి రంగంలో భారత్ అనుకున్నంతగా రాణించకపోవడం ఒక కారణం అయితే కంపెనీకి వచ్చే లాభాల్లో 60 నుంచి 70 శాతం వారకు ఉద్యుగుల జీతాలకే పోతున్నాయని అనలిస్ట్ లు చెబుతున్నారు. అందువల్ల ఐటి కంపెనీలు ఆటోమిషన్ పెంచి ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని చెబుతున్నారు.

ఇక ఈ తరహా సమస్యలకు కాట్రాక్టులు రాకపోవడం కూడా మరింత భారంగా మారయట. కనీసం ప్రస్తుతం ఉన్న కాట్రాక్టులను రెన్యూవల్ కూడా చేయలేకపోతున్నామని ప్రముఖ కంపెనీ దిగ్గజాలు వాబోతున్నాయి. ఈ విధానానికి ట్రంప్ కూడా ఓ కారణమే అంటున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న కొన్ని ఐటి దిగ్గజాలు ట్రంప్ మాటలకు లోబడి అక్కడి వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇండియాన్ టెక్కీలు పనికిరాని వారు అనే అబద్దపు ముద్ర వేసి పదవుల్లో నుంచి పికి పారేస్తున్నారు. ముఖ్యంగా మిడ్, సీనియర్ హోదాలో ఉన్న వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి ప్రధాన ఐటి దిగ్గజాలు. ఇందులో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ప్రధాన ఐటి కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా టిసిఎస్ మాత్రం ఉద్యోగాలను తొలగించడం లేదని చెబుతూ… ఈ సవత్సరం వేళ సంఖ్యలో ఉద్యోగాలను ఆఫర్ చేస్తామంటున్నాయి. బిహార్‌లో తమ రెండో క్యాంపస్‌ను ప్రారంభించి త్వరలోనే నోటిఫికేషన్ ని విడుదల చేస్తామని టిసిఎస్ తెలిపింది.