Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జమ్మూ కాశ్మీర్ లోని కాతరా అనే ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఏడుగురు మరణించారు సాధారణంగా జమ్మూ నుండి వైష్ణోదేవికి భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు నడుస్తుంటాయి. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఏడుగురితో కూడిన ఓ హెలికాప్టర్ దైవ దర్శనానికి వైష్ణోదేవికి బయలు దేరింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సింగిల్ ఇంజన్ తో కూడిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్ దర్యాప్తుకు ఆదేశించగా.. అధికారులు దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణం కనుగొన్నారు. ఓ పక్షి వచ్చి హెలికాప్టర్ ను డీ కొనడంతో అది అదుపుతప్పి కూలిపోయింది. ఘటనా స్థలంలో పక్షి మృత దేహం కూడా లభించటంతో అధికారులు ఈ విషయాన్ని తేల్చారు.