Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కిలాడి పనులు చేస్తూ బ్రతకడంలో కొందరికి భలే కిక్కు వుంటుంది. ఆ పనుల చేసే వారు ఎప్పుడు పోలీసులని నుంచి తప్పించుకోవడానికి చాలా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ వుంటారు. అలాగే అమెరికాలో ఓ అమ్మాయి దొంగతనం చేసి తరువాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అబ్బాయి వేషం వేసుకుంది. ఏదైతేనేం చివరికి పోలీసులకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే. కాలిఫోర్నియాలో ఓ బ్యాంకు లో రెండు రోజుల క్రింతం ఓ దొంగతనం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకులో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే అందులో ఓ వ్యక్తి బ్యాంకు లోకి వచ్చి సిబ్బందిని బెదిరించి డబ్బు తీసుకొని పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. అయితే అందులో వున్న దొంగకి గడ్డం లేదని, గడ్డం వున్నట్లు పెయింటింగ్ వేసుకున్నాడని గుర్తించారు. అలాగే ఆ దొంగ నడక, నడత పరిశీలించిన పోలీసులు దొంగని గుర్తించారు. నిజానికి ఆ దొంగతం చేసింది అబ్బాయి కాదని, అబ్బాయి వేషంలో వున్న అమ్మాయి అని కనిపెట్టారు. ఆ అమ్మాయి కూడా గతంలో పోలీసుగా వుద్యోగం చేసి, పనితీరు సరిగా లేకపోవడంతో సస్పెండ్ కి గురైంది. ఆమె ఇప్పుడు దొంగగా మారి బ్యాంకుని దోచేసుకుంది. మొత్తానికి ఏదైతేనేం ఆమె ఇప్పుడు పోలీసుల అదుపులో వుంది.