Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

విశాఖలోని తీర ప్రాంత గ్రామాల్లో పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వలన ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. విశాఖ జిల్లా తీరా ప్రాంత గ్రామాలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యం విశాఖలోని 12 గ్రామాల విద్యావంతులు, పెద్దలు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనదనే చెప్పాలి. పేద కుటుంబాలు పొగాకు బారిన పడి క్యాసర్ వలన ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో ఆయా గ్రామాల్లోని విద్యావంతులు, ప్రజా సంఘాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చాయి. స్వచ్చందంగా పొగాకు నిషేధాన్ని పాటించడంలో 12 గ్రామాలు విజయం సాధించాయి.

ఇప్పటికే ఆ గ్రామాల ప్రజలు పొగాకు నిషేధాన్ని 80 నుంచి 90 శాతం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అరకు మండలంలోని పెదగంగుడి,దమసారై, మర్దగూడ, చుకుమడత, డి కొల్లాపుట్, నిరంజవలస, కె కోసిగూడ, దబాపుతూ, కుంటూర్ల, లింగవరం మరియు పొంగలి పాక వంటి గ్రామాలు స్వచ్చందంగా పొగాకు నిషేధాన్ని దాదాపుగా పాటిస్తున్నాయి. ఈ గ్రామాల్లోని దుకాణాల్లో గుట్కా, బీడీ, ఖైనీ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారు. ఈ గ్రామాలతో పటు మరికొన్ని గ్రామాలు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైంది.

ఈ ఘనత సాధించడం పట్ల ఎన్ జి ఓ నేచర్ డైరెక్టర్ ఎస్ బాల రాజు మాట్లాడారు.గ్రామాల ప్రజలతో కలసి తాము మూడేళ్ళుగా చేసిన కృషికి ఫలితమిదని ఆయన అన్నారు. ఆయా గ్రామాల్లో పొగాకు నిషేధించడానికి తాము యూత్ అసోసియేషన్స్ , యూత్ లీడర్స్ తో కలసి ప్రజలను చైతన్య వంతం చేసే కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. కాగా బుధవారం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా విశాఖలో రాయాలి నిర్వహించారు. పాగాకు నిషేధాన్ని పాటిస్తున్న ఆయా గ్రామాల గురించి వివరించారు.