Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి అసెంబ్లీ భవనంలో వర్షపు నీరు లీకేజి హాట్ టాపిక్ గా మారింది. ఇక వైఎస్సార్ సిపి పార్టీ కార్యకర్తలు అయితే ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలేయకూడదని పూర్తి విచారణ జరపాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన సిఐడి అధికారులు తమదైన శైలిలో విచారణ చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి అందులో రికార్డైన మొదటి అంతస్తు దృశ్యాలను అధికారులు పరిశీలించారు. అయితే రెండో అంతస్తుకు ఎవరు వెళ్లారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా వర్షం కురుస్తున్న సమయంలో కొందరు పైకి వెళ్లినట్లు గుర్తించు వారిని కనుగొనడాని ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అక్కడ పనిచేసేవారిని కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. మొదటి అంతస్తుకు మెట్ల ద్వారా పలువురు ఎక్కుతున్నట్టు సీఐడీ బృందం గుర్తించింది. అయితే ఈ వాటర్ లీకేజిపై వీలైనంత త్వరగా సిఐడి అధికారులు ఓ నివేదికను ఇవ్వనున్నట్లు సమాచారం.