Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోజు రోజుకు పెరుగుతున్న ఉత్కంఠతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తట్టుకోలేకుండా పోతున్నాయి. ఫలితాల మాటెలాఉన్నా కార్యకర్తల్లో కౌంటింగ్‌ వరకూ ఉత్సాహం తగ్గకుండా చూసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం ఎస్‌ఎంఎస్‌లతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయి. సీమాంధలో జరుగుతున్న ఈ తంతుతో ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ చాపకింద నీరు లాంటి ప్రచారంతో బెట్టింగులు మరింతగా పెరిగిపోతున్నా యి. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు 110 నుంచి 120 స్థానాలు తమవేనని ధీమాగా ప్రచారం చేసుకుంటున్నాయి. విచిత్రం ఏమిటంటే రెండు పార్టీలూ కూడా తమ ప్రత్యర్ధులకు 51 నుంచి 54 స్థానాలు మాత్రమే ఇస్తున్నాయి.

సీమాంధ్రలోని మోత్తం అసెంబ్లీ స్దానాలెన్ని ? రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరన్నా వెంటనే చెప్పే సమా దానం 175. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంలో సర్వత్రా చర్చా జరుగుతోంది. అందులో భాగంగానే ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు లభించే స్ధానాలు ఎన్ని అన్న విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీకి లెక్కలు వేసుకుంటు న్నాయి. అధికారంలోకి వస్తాయని అందరూ అనుకుంటున్న తెలుగుదేశంపార్టీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా అంతర్గతంగా జిల్లా ల వారీగా అంచనాలు వేసుకు న్నాయి. పార్టీలు వేసుకునే అంచ నాలు, లెక్కలు సహజంగానే ఆయా పార్టీలకు అనుగు ణంగానే ఉంటాయనటంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఆ విధంగా వేసుకున్న అంచనాలకే అంకెల రూపంలో అంతర్గత సర్వేలని చెబుతూ అటు టీడీపీ, ఇటు వైఎస్‌ఆర్‌సీపీలు పార్టీ నేతలకు, శ్రేణులతోపాటు పలువురికి ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అందజేస్తున్నాయి.

ఈ సర్వే ఎస్‌ఎంఎస్‌లను చూసిన వారు ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్దితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఎవరికి వారు వేసుకున్న లెక్కల ప్రకారమైతే ప్రస్తుత అసెంబ్లీలోని 175 స్దానాలు సరిపోవు. రెండు పార్టీలు తాము ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకున్న స్దానాల సంఖ్య సుమారుగా 220 సీట్లు. పనిలో పనిగా ఇతరులు గెలుస్తాయని ఉధారంగా మరో 15 సీట్లు ఇస్తున్నాయి. అంటే మొత్తం సీట్ల సంఖ్య 235. మరి ఉన్న స్ధానాలేమో 175. మరి ఏమిటీ లెక్కలు? ఎక్కడో తిరకాసుందనుకుంటున్నారా. తిరకాసేమీ లేదు కానీ అందరినీ మభ్యపెట్టటమే వారు చేస్తున్న ప్రచారం ఉద్దేశ్యం. ఈ నెల 16న జరగనున్న ఓట్ల లెక్కింపు తర్వాత తామె అధికారంలోకి రాబోతున్నట్లు ఇటు వైఎస్‌ఆర్‌ సీపీ, అటు తెలుగుదేశం పార్టీలు రెండూ తమ నేతలను, శ్రేణు లను ఉత్సాహపరుస్తున్నాయి.

ప్రత్యర్దిపార్టీనే అధికారంలోకి వస్తోందని ఏ పార్టీ కూడా చెప్పదు. ఎందుకంటే మేనెల 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు సదరు పార్టీకి కౌటింగ్‌ ఏజెంట్లు కూడా దొరకరు. 16వ తేదీ వరకన్నా పార్టీ నేతలను, శ్రేణులను అదుపులో ఉంచుకోవాలని పార్టీలు అనుకుంటు న్నాయి. అందులో భాగంగానే ఈ సర్వే ఎస్‌ఎంఎస్‌లు. నిజానికి రెండు పార్టీలు విడుదల చేస్తున్న ఎస్‌ఎంఎస్‌లలో ఏదో ఒకటే నిజమైనది.అంటే సీట్లలో తేడా రావచ్చు గానీ గెలుస్తుందని అనుకుంటున్న పార్టీ ఖచ్చితంగా అయితే ఓడిపోదు. అంటే రెండు పార్టీల్లో ఏదో ఒకటి నేతలను, కార్యకర్తలతో పాటు ఇతరులను కూడా మభ్యపెడుతోందన్న మాట. టీడీపీ పేరుతో చెలామణిలో ఉన్న సర్వే ప్రకారమైతే టీడీపీకి వంద అసెంబ్లీ సీట్లు వస్తాయి.

వైఎస్‌ఆర్‌సీపీకి 51, మరో 24 సీట్లలో రెండు పార్టీల మధ్య పోటా పోటీగా ఉంది. ఇక, వైఎస్‌ఆర్‌సీపీ పేరుతో చెలామణి అవుతున్న ఎస్‌ఎంఎస్‌ల విషయంలో కొస్తే ఆ పార్టీకి 120 అసెంబ్లీ సీట్లు, తెలుగుదేశంకు 37 సీట్లు, కాంగ్రెస్‌కు మూడు, ఇతరులకు 15 సీట్లు వస్తాయి. టీడీపీ లెక్కల ప్రకారం ఉత్తరాంధ్రలోని మొత్తం 34 సీట్లకు గాను ఆ పార్టీకి 21 సీట్లు వస్తాయి. రాయలసీమలోని 52 సీట్లలో 21 సీట్లు వస్తాయి.కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లోని మొత్తం 89 స్దానాలకు గాను 58 సీట్లు వస్తాయి. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని మొత్తం 10 సీట్లకు గాను టీడీపీ వైఎస్‌ఆర్‌సీపీకి ఏడు సీట్లు, ఇతరుల ఖాతాలో మిగిలిన మూడు సీట్లను వేయగా, వైఎస్‌ఆర్‌సీపీ ఏమో మొత్తం 10 సీట్లను తన ఖాతాలోనే వేసుకుంది. అదే విధంగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ తన ఖాతాలో ఏడు సీట్లు, వైఎస్‌ఆర్‌సీపీకి నాలుగు వేసి మరో మూడు సీట్లను పోటాపోటీగా ఉన్నట్లు పేర్కొంది. అదే వైఎస్‌ఆర్‌సీపీ అయితే తనకు తొమ్మిది సీట్లను, టీడీపీకి మూడు సీట్లను వేసి ఇతరుల ఖాతాలో మరో రెండు సీట్లను వేసింది. అదే విధంగా రాయలసీమలోని మొత్తం 52 సీట్లలో వైఎస్‌ఆర్‌సీపీ తన ఖాతాలో 36 సీట్లను వేసుకోవటం గమనార్హం.