Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అల్లు అర‌వింద్ 500 కోట్ల బ‌డ్జెట్‌తో `రామాయ‌ణం` తెర‌కెక్కిస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌గానే.. ఈ సినిమాలో కాస్టింగ్ ఎవ‌రు? అన్న చ‌ర్చ సామాజిక మాధ్య‌మంలో మొద‌లైంది. ముందుగా రావ‌ణాసురుడుని నెటిజ‌నులు ప్ర‌క‌టించేశారు. భ‌ళ్లాల‌దేవ‌గా న‌టించిన రానా అయితే రావ‌ణాసురుడిగా సూట‌వుతాడంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డుస్తోంది. అయితే సినిమాలో ఇత‌ర కీల‌క క్యారెక్ట‌ర్లకు ఎవ‌రెవ‌రు సూట‌వుతారు? అని ఆలోచిస్తే .. మెగా రామాయ‌ణం అన్న కోణంలో విశ్లేషిస్తే ఇంట్రెస్టింగ్‌గా ఆ క్యారెక్ట‌ర్ల‌కు ఫ‌లానా వాళ్లు సూట‌వుతారు.. అని గెస్ చేస్తే .. ఇలా మెగాభిమానుల్లో అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ శ్రీ‌రాముడిగా న‌టిస్తే ఇలా క‌నిపిస్తాడు.. అంటూ ఫ్యాన్‌మేడ్ పోస్ట‌ర్ సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. చ‌ర‌ణ్ గెట‌ప్ సూట‌బుల్ అనిపించేలా ఆ పోస్ట‌ర్ క‌న్విన్స్ చేసింది. మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన చెర్రీకి ఆ మాత్రం స్టామినా స‌రిపోతుంది. ఇక సీత‌గా న‌వ‌త‌రం నాయిక కీర్తి సురేష్ సూట‌బుల్ అని విశ్లేషిస్తున్నారు. మెజారిటీ పార్ట్ నెటిజ‌నులు రానా రావ‌ణాసురుడు అయ‌తే బావుంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. భ‌ళ్లాలుడిగా మెప్పించిన రానా సూట‌బుల్ అన్న‌దే వారి ఆలోచ‌న‌. అలాగే ఇదే సినిమాలో అత్యంత కీల‌క‌మైన ఆంజ‌నేయుడు, సుగ్రీవుడు పాత్ర‌ల్ని సాయిధ‌ర‌మ్ తేజ్‌లాంటి కండ‌ర‌గండ‌డితో చేయిస్తే త‌ప్పేం కాద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ఇత‌ర‌త్రా క్యారెక్ట‌ర్ల‌లో ఏ పాత్ర‌కు ఎవ‌రు సూట‌వుతారు? అని గెస్ చేస్తే..

శ్రీ‌రాముడు- రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌
సీత‌- కీర్తి సురేష్
ఆంజ‌నేయుడు- సాయిధ‌ర‌మ్ తేజ్‌
జటాయువు- వ‌రుణ్‌తేజ్‌
ల‌క్ష్మ‌ణుడు- అల్లు శిరీష్‌
రావ‌ణాసురుడు- రానా
వాలి- అల్లు అర్జున్‌
సుగ్రీవుడు- సాయి ధ‌ర‌మ్ తేజ్‌