Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ రాజకీయాల్లో ఓ మహా శకం ముగిసింది. దాదాపు ఎందున్నారా నెలలపాటు మృత్యువుతో పోరాడి తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళప్రజలు ఆత్మీయంగా అమ్మ అని పిలుచుకునే నాయకురాలు జయలలిత నిన్న రాత్రి 11:30లకు మరణించినట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అప్పటి దాకా కను కొనల్లో కన్నీళ్లను, గుండెల నిండా ఉద్వేగాన్ని అదిమిపెట్టుకున్న తమిళ ప్రజలు ఒక్కసారి అనాథలమయ్యామంటూ బోరున విలపించారు. అమ్మ లేని ఈ తమిళ రాష్ట్రంలో మేము ఉండేలమంటూ గుండెలు బాదుకున్నారు. నెలల తరబడి ఉత్తమ వైద్య బృందం, లండన్ డాక్టర్ రిచర్డ్ చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

ప్రజల ఆవేశాన్ని, జరగబోయే తీవ్ర పరిణామాల్ని అంచనా వేసిన నాయకులు, అధికారులు ప్రజలను శాంతింపజేసి, చెన్నై నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత మెల్లగా అమ్మ మరణవార్తను ప్రకటించారు. జయ మరణవార్త పట్ల ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు సుదీర్ఘ చర్చల అనంతరం అమ్మకు అత్యంత నమ్మకస్తుడు పన్నీర్ సెల్వంను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జయ మిత్రురాలు శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లు కేంద్ర రాజకీయాలను శాసించిన అమ్మ మరణంతో ఇకపై పార్టీ భవితవ్యం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుందని, స్వతంత్ర్య, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అమ్మలాంటి నాయకత్వం మళ్ళీ దొరకడం కలేనని పార్టీ వర్గాలు ఆందోళన[ఆందోళనపడుతున్నాయి.