Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గత నెల రోజుల నుండి అటు తమిళనాడు, ఇటు సీమాంద్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తమిళనాడులో అయితే వరదల దెబ్బకు 100మంది మరణించారు. ఇప్పటికీ కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం తడిసి ముద్దైంది. నగరం లోని అన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మోదీని 2000కోట్లు వరద సాయం కోరగా మోదీ 940కోట్లు ప్రకటించి తమిళనాడును ఆదుకున్నారు.

ఇటు సీమాంద్రలో కురిసిన వర్షాలు తమిళనాడును మించిపోయేలా నష్టాన్ని మిగిల్చాయి. ఇంకా ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వరదలకి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల 54గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో జరిగిన పంట నష్టం విలువ 4000కోట్లు. 15000 ఎకరాల్లో దెబ్బతిన్న ఆక్వా నష్టం విలువ 2000కోట్లు. జిల్లా వ్యాప్తంగా 30,000మది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకూ 156 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా అవి ఏమాత్రం సరిపోవటం లేదు.

దీంతో ముఖ్యంత్రి చంద్రబాబు మూడు రోజుల పాటూ నెల్లూరు జిల్లలో పర్యటన జరిపి నష్టాన్ని అంచనా వేసి ప్రధాని మోదీ ని 1000కోట్ల మేర వరద సాయం కోరగా ప్రధాని నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. 2000కోట్లు సాయం అడిగిన వెంటనే జయలలితకు 940 కోట్లు సాయం ప్రకటించిన మోదీ బాబు సాయం కోరి రోజులు గడుస్తున్నా ఎటువంటి
సాయమూ అందించలేదు. అన్ని విధాలా ఏపీకి అండగా ఉంటానని చెప్పిన మోదీ తీరా ఆపద సమయానికి మౌనం దాల్చటం ఏపీ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది.